ఆమెకు బ‌రువులు మోయడం కొత్త కాదు ఒక‌ప్పుడు కుటుంబం క‌డుపు నింప‌డానికి ఇప్పుడు 140 కోట్ల ప్ర‌జ‌ల ఆశ‌ల భారాన్ని

ఆమెకు బ‌రువులు మోయడం కొత్త కాదు. ఒక‌ప్పుడు కుటుంబం క‌డుపు నింప‌డానికి క‌ట్టెలు మోసింది. ఇప్పుడు 140 కోట్ల ప్ర‌జ‌ల ఆశ‌ల భారాన్ని మోస్తూ ఒలిం


పిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చింది. ఆమె పేరు మీరాబాయ్ చాను.

ఆమెది ఈశాన్య భార‌తం. మ‌ణిపూర్ కొండ‌కోన‌ల్లో పుట్టి పెరిగింది. ఆరుగురు సంతానంలో అంద‌రి కంటే చిన్న‌ది. కానీ కుటుంబ బ‌రువు బాధ్య‌త‌లు మోయ‌డంలో మాత్రం పెద్ద‌దే. ఇంఫాల్‌కు 20 కిలోమీట‌ర్ల దూరంలోని నాంగ్‌పాక్ కాక్‌చింగ్ అనే ఊళ్లో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది సైఖోమ్ మీరాబాయ్ చాను. కొండ‌కోనల్లో క‌ట్టెలు కొట్టుకొచ్చి క‌డుపు నింపుకోవ‌డమే ఆ కుటుంబానికి తెలిసింది. అంద‌రి కంటే చిన్న‌దైనా కూడా మొద‌టి నుంచీ బ‌రువులు మోయడంలో మీరాబాయ్ దిట్ట‌. 12 ఏళ్ల వ‌య‌సులోనే త‌న అక్క‌లు కూడా మోయ‌లేని బ‌రువును త‌ల‌పై ఎత్తుకొని 2 కిలోమీట‌ర్లు అవ‌లీల‌గా న‌డిచేసింది. స‌రిగ్గా 8 ఏళ్ల ఆ త‌ర్వాత ఆ అమ్మాయే 2014 కామ‌న్వెల్త్ గేమ్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింది.